ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి అస్వస్థత

MLA Kotamreddy Sridhar Reddy is Sick - Sakshi

సాక్షి, విజయవాడ: నెల్లూరు రూరల్‌ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డికి హైబీపీ రావడంతో వైద్యులు ప్రాథమిక చికిత్సనందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు శ్రీధర్‌రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. తర్వాత మంత్రులు ఆళ్ల నాని, పేర్ని నాని, ఎమ్మెల్యే జోగి రమేష్‌లు కోటంరెడ్డిని పరామర్శించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top