చంద్రబాబు పాదయాత్ర.. పాతాళ యాత్ర | MLA Babu rao blames chandra babu naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు పాదయాత్ర.. పాతాళ యాత్ర

Aug 4 2013 4:02 PM | Updated on Oct 22 2018 9:16 PM

చంద్రబాబు నాయుడు చేపట్టిన పాదయాత్ర పాతాళయాత్రగా మారిపోయిందని పాయకరావు పేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు విమర్శించారు.

శ్రీకాకుళం:టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన పాదయాత్ర పాతాళయాత్రగా మారిపోయిందని పాయకరావు పేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల  చేపట్టిన 'మరో ప్రజా ప్రస్థానం' పాదయాత్ర ముగింపు సభలో ఆయన మాట్లాడారు. త్వరలోనే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి భంగపాటు తప్పదన్నారు. సోనియా గాంధీ ఓడిపోయి జగన్ కాళ్లు పట్టుకునే పరిస్థితి వస్తుందన్నారు.

కాగా,  బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు మాట్లాడుతూ.. షర్మిల పాదయాత్ర రికార్డు సాధించడం కోసం కాదని.. ప్రజల ఇబ్బందులను తెలుసుకునేందుకు ఆమె పాదయాత్ర చేపట్టిందని తెలిపారు.  ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోని పాలకపక్షం,  ప్రజల తరపున నిలబడాల్సిన ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కైయాయని ఆయన చురకలంటించారు. టీడీపీ ప్రజల పక్షం నిలబడటం మాని..అధికార పార్టీకి కొమ్ము కాస్తోందని ఆయన విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement