పాడేరులో భవ్యశ్రీ సెల్ఫోన్ సిగ్నల్! | Missing techie Bhavya sri traced in visakha district paderu! | Sakshi
Sakshi News home page

పాడేరులో భవ్యశ్రీ సెల్ఫోన్ సిగ్నల్!

Oct 11 2014 9:43 AM | Updated on Sep 2 2017 2:41 PM

పాడేరులో భవ్యశ్రీ సెల్ఫోన్ సిగ్నల్!

పాడేరులో భవ్యశ్రీ సెల్ఫోన్ సిగ్నల్!

మూడు రోజుల క్రితం హైదరాబాద్ లో అదృశ్యమైన సాప్ట్వేర్ ఇంజినీర్ భవ్యశ్రీ చరిత ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు.

విశాఖ : మూడు రోజుల క్రితం హైదరాబాద్ లో అదృశ్యమైన సాప్ట్వేర్ ఇంజినీర్ భవ్యశ్రీ చరిత ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఆమె సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా  విశాఖ జిల్లా పాడేరు  గెస్ట్హౌస్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దాంతో పాడేరు  గెస్ట్హౌస్కు చేరుకున్న సైబరాబాద్ పోలీసులకు...రూమ్లో టీవీ ఆన్లో ఉన్నా ఆమె మాత్రం కనిపించలేదు. అయితే మీడియాలో వస్తున్న కథనాలతో అప్రమత్తమైన భవ్యశ్రీ  అక్కడ నుంచి మరో చోటుకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

భవ్యశ్రీ మిస్సింగ్పై మీడియాలో కవరేజ్ విస్తృతంగా ఉండటంతో...ఆమె ఎప్పటికప్పుడు సమచారాన్ని తెలుసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా హైదరాబాద్ నుంచి వెళ్లిన ప్రత్యేక పోలీస్ బృందం ఆమె సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా కేసును ఛేదించే పనిలో పడ్డారు. అయితే భవ్యశ్రీ కేసు పురోగతి వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు.

కాగా శుక్రవారం సాయంత్రం భవ్యశ్రీ ఫోన్ సిగ్నల్స్ అన్నవరం పరిసరాల్లోని సెల్‌టవర్ పరిధిని సూచించడంతో అక్కడి పోలీసులు అన్నవరంలో అన్ని లాడ్జీలు, దేవస్థాన వసతి గృహాల్లో తనిఖీ చేశారు. అయినా ఆమె ఆచూకీ తెలియరాలేదు.  మధ్యలో ఆమె గోవా వెళ్లినట్లు కూడా అనుమానించారు. మరోవైపు మూడు రోజులైనా భవ్యశ్రీ ఆచూకీ లభించకపోవడంతో ఆమె భర్త, ఇతర కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement