'ఎన్టీఆర్ రూపకల్పన చేస్తే..మేం పూర్తి చేస్తాం' | Minister inspecting works at Handri-Neeva Project | Sakshi
Sakshi News home page

'ఎన్టీఆర్ రూపకల్పన చేస్తే..మేం పూర్తి చేస్తాం'

Mar 2 2015 10:47 AM | Updated on Aug 29 2018 1:59 PM

హంద్రినీవా సుజల స్రవంతిని ఎన్టీఆర్ రూపకల్పన చేశారని, దాన్ని పూర్తి చేసే అవకాశం తమకు దక్కిందని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ అన్నారు.

అనంతపురం :  హంద్రినీవా సుజల స్రవంతిని ఎన్టీఆర్ రూపకల్పన చేశారని, దాన్ని పూర్తి చేసే అవకాశం తమకు దక్కిందని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ అన్నారు.  హంద్రినీవా పనులను 15 రోజులకొకసారి సమీక్షిస్తామని ఆయన సోమవారమిక్కడ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం ఇప్పటికే 32వేల ఎకరాలను సమీకరించినట్లు దేవినేని ఉమ పేర్కొన్నారు.

 

ఈ సందర్భంగా హిందుపురం టీడీపీ ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ మాట్లాడుతూ హంద్రినీవా పనులను త్వరలో పూర్తి చేసి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామన్నారు. హంద్రినీవా సుజల స్రవంతి కాలువ  పనులను మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాధరెడ్డి, దేవినేని ఉమ, ఎమ్మెల్యే బాలకృష్ణ తదితరులు పర్యవేక్షించారు.

Advertisement
 
Advertisement
Advertisement