
సాక్షి, శ్రీకాకుళం: తిత్లీ తుపాను బీభత్సానికి అతలాకుతలమైన ఉద్దానం ప్రాంతం త్వరగా కోలుకునేందుకు ఎంత సాయం చేయడానికైనా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శుక్రవారం జరిగిన ఉద్దానం పునర్నిర్మాణం సదస్సులో మంత్రి మాట్లాడుతూ.. తిత్లీ తుపానుతో ఉద్దానం రెండు తరాల వెనక్కి వెళ్ళిపోయిందన్నారు. రైతాంగం త్వరగా కోలుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. గత ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారానికి అదనంగా పరిహారం ఇచ్చామని వెల్లడించారు.