మద్య నిషేధమే ప్రభుత్వ లక్ష్యం

Minister Avanthi Srinivas Says Step By Step The Government Goal Ban Liquor - Sakshi

మంత్రి అవంతి శ్రీనివాస్‌

సాక్షి, విశాఖపట్నం: దశలవారీగా మద్య నిషేధం ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..గతంలో మద్యపాన నిషేధం విఫలమయిందని.. ప్రభుత్వమే స్వయంగా దుకాణాలు నిర్వహించడానికి ముందుకొచ్చిందని.. దీంతో సిండికేట్లకు చెక్‌ పెట్టగలిగామన్నారు. ఎమ్మార్పీ రేట్లకే మద్యం విక్రయించి అవినీతికి ఆస్కారం లేకుండా చేస్తున్నామని వెల్లడించారు. సూపర్ వైజర్లకు 17,500 జీతం ఇస్తున్నామని పేర్కొన్నారు. బీటెక్‌ చదివిన వారికి కూడా ఇంత జీతం రావడం లేదని..ఉద్యోగం పొందిన వారు చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలని తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top