సీమాంధ్ర ప్రజల మనోభావాలను కించపరచి రాష్ట్రవిభజనకు కారకుడైన మంత్రి ఆనం సీమాంధ్ర ద్రోహిగా మిగిలిపోతాడని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక చైర్మన్, ఏపీ ఎన్‌జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు చొప్పా రవీంద్రబాబు విరుచుకుపడ్డారు.
నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్: సీమాంధ్ర ప్రజల మనోభావాలను కించపరచి రాష్ట్రవిభజనకు కారకుడైన మంత్రి ఆనం సీమాంధ్ర ద్రోహిగా మిగిలిపోతాడని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక చైర్మన్, ఏపీ ఎన్‌జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు చొప్పా రవీంద్రబాబు విరుచుకుపడ్డారు. నగరంలోని ఏబీఎం కాంపౌండ్ నుంచి వేదిక ఆధ్వర్యంలో మహాప్రదర్శన నిర్వహించారు. సంతపేటలోని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఇంటి ముట్టడికి బయల్దేరారు. సెయింట్‌జాన్స్ స్కూల్ వద్దకు ప్రదర్శన చేరుకోగానే డీఎస్పీ వెంకటనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో అడ్డుకున్నారు. రోడ్డుకు అడ్డంగా ఇనుప ముళ్ల కంచె ఏర్పాటు చేసి ఉద్యమకారులను నిలువరించారు.
సమైక్యవాదులు రో డ్డుపై బైఠాయించి మంత్రి ఆనం, కేంద్రమంత్రి పనబాక లక్ష్మి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రవీంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి రాజకీయ అవకాశవాదానికి రాష్ట్ర విభజన జరుగుతోందన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ఎంతో కాలం పాలన సాగించలేరన్నారు. మంత్రికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని పలుచన చేస్తూ కేంద్రానికి నివేదించి పబ్బం గడుపుకోవాలనుకుంటున్న మంత్రి ఆనంను ప్రజలు ఎప్పటికీ క్షమించరని హెచ్చరించారు. ఉద్యమకారులను పోలీ సులు అరెస్ట్‌చేసి నగరంలోని పలు పోలీసుస్టేషన్లకు తరలించారు. ప్రదర్శన సందర్భంగా హిజ్రాలు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలి చాయి. కార్యక్రమంలో ఎన్‌జీఓ సంఘ నాయకులు రమణారెడ్డి, వెంకమరాజు, సుధాకరరావు, ఆంజనేయవర్మ, శేఖర్‌రావు, సతీష్, మంజు, శైలజ, రమణరాజు తది తరులు పాల్గొన్నారు.