ఏపీ మంత్రి కాన్వాయ్‌కు ప్రమాదం | Minister adinarayana reddy's Convoy Meets With Accident In Kodada | Sakshi
Sakshi News home page

ఏపీ మంత్రి కాన్వాయ్‌కు ప్రమాదం

Jul 17 2017 11:53 AM | Updated on Aug 30 2018 4:10 PM

ఏపీ మంత్రి కాన్వాయ్‌కు ప్రమాదం - Sakshi

ఏపీ మంత్రి కాన్వాయ్‌కు ప్రమాదం

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి ఆదినారాయణ రెడ్డికి త్రుటిలో ప్రమాదం తప్పింది.

సూర్యాపేట : ఆంధ్రప్రదేశ్‌ మంత్రి ఆదినారాయణ రెడ్డికి త్రుటిలో ప్రమాదం తప్పింది. సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద  ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని వాహనానికి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో  మంత్రి ఆది నారాయణరెడ్డికి చెందిన ఇద్దరు గన్‌మెన్లు, డ్రైవర్‌కు స్వల్పంగా గాయపడ్డారు.

సోమవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి  అమరావతి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.  వర్షం పడుతుండటంతో రహదారి కనపడక కాన్వాయ్‌లోని ఒక వాహనం డివైడర్‌ను ఢీకొట్టింది. గన్‌మెన్లు, డ్రైవర్‌ను మంత్రి తన వాహనంలో కోదాడ ఆస్పత్రికి తీసుకెళ్ళి చేర్చారు.

 

Advertisement
 
Advertisement
Advertisement