ఆంధ్రప్రదేశ్లోనూ భూప్రకంపనలు | Mild quake in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్లోనూ భూప్రకంపనలు

Apr 25 2015 1:10 PM | Updated on Sep 3 2017 12:52 AM

ఆంధ్రప్రదేశ్లోనూ భూప్రకంపనలు

ఆంధ్రప్రదేశ్లోనూ భూప్రకంపనలు

ఆంధ్రప్రదేశ్లోని శనివారం పలు జిల్లాల్లో భూమి కంపించింది. విశాఖ, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ..

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భూమి కంపించింది. విశాఖ, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో  భూమి స్వల్ప ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.  దాంతో ప్రజలు భయంతో ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు.

 

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, ఉండి, విశాఖలో మధురవాడ, మురళీనగర్, శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పూండి, ఉద్దానం, విజయవాడ ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది. సుమారు మూడు సెకన్ల పాటు భూమి కంపించినట్లు తెలుస్తోంది.  మరోవైపు ఏపీలో భూప్రకంపనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ల ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement