కాంక్రీట్‌ పనులు ప్రారంభించిన ఎంఈఐఎల్‌

Megha Engineering Starts Polavaram project Spillway Works  - Sakshi

పోలవరం స్పిల్‌ వే పనులు 2020 జూన్‌కు పూర్తి

సాక్షి, పోలవరం : అనుకున్నట్టుగానే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోలవరం ప్రాజెక్ట్‌ నిర‍్మాణ పనులను పరుగులు పెట్టిస్తున్నారు. చెప్పిన గడువుకంటే ముందుగానే పోలవరం పూర్తిచేయాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా స్పిల్ వే ప్రాంతంలో కాంక్రీట్ పనులకు మేఘా ఇంజనీరింగ్ సంస్థ గురువారం శ్రీకారం  చుట్టారు. తొలిరోజు 100 క్కుబిక్కు మీటర్ల పనిని ఇవాళ పూర్తి చేసింది. ఈ పనుల శాతాన్ని రోజు రోజుకు పెంచుకుంటూపోతూ లక్ష్యం మేరకు పనులను పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నది.

ప్రభుత్వం నిర్వహించిన రివర్స్ టెండర్ల పాల్గొన్న ఎంఈఐఎల్  పోలవరం ప్రాజెక్ట్ పనులను 12.6 శాతం తక్కువకు కోట్ చేసి దక్కించుకొంది. ఈ నెల ఒకటో తేదీన ప్రాజెక్ట్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన విషయం తెలిసిందే. ఈ రివర్స్ టెండరింగ్ వల్ల  ప్రభుత్వానికి 782 కోట్ల రూపాయలు ఆదా అయింది. కాగా మొదటిగా మేఘా ఇంజనీరింగ్ భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలోని రోడ్లను మరమ్మతులు చేసి ఆ ప్రాంతాన్ని నిర్మాణానికి అనుకూలంగా తీర్చిదిద్దింది. తాజాగా కాంక్రీట్ పనులకు శ్రీకారం  చుట్టింది. స్పిల్ వే ప్రాంతంలో పనులను ఇవాళ ప్రారంభించింది.  ముందుగా నిర్ణయించిన సమయానికి కాంక్రీట్ వేయటం ప్రారంభించిన మేఘా సంస్థ ప్రతినిధులు తోలి రోజు 100 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్  వేశారు. ఈ పరిమాణాన్ని రోజు రోజుకు పెంచుకుంటూపోతామని  ఎంఇఐఎల్  సంస్థ జనరల్ మేనేజర్ అంగర సతీష్ బాబు తెలిపారు. 

ముఖ్యమంత్రి ఆదేశాలను అనుగుణంగా  ప్రస్తుతం స్పిల్ వే వద్ద పనులు కొనసాగుతున్నాయి.  ప్రాజెక్ట్ నిర్మాణ  ప్రాంతంలో వర్షపు  నీరు ఎక్కువగా ఉంది. ఆ నీటిని తొలుత సాధారణ ప్రవాహం ద్వారా తగ్గించే ఏర్పాట్లను మేఘా సంస్థ చేసింది. నీటి మట్టం కొంత తగ్గిన తరువాత మోటార్లను ఉపయోగించి ఆ నీటిని నిర్మాణ ప్రాంతం నుంచి పూర్తిగా తొలగిస్తామని సతీష్  చెప్పారు. స్పిల్ వేలో మూడు లక్షల క్యూబిక్ మీటర్ల పనులు చేయాల్సి ఉంది.  స్పిల్ ఛానల్ లో 5.3 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు చేయాలి. అయితే స్పిల్ చానల్ లో నీటి నిల్వ ఎక్కువగా ఉండటంతో  నీరు తగ్గిన తరువాత  మేఘా ఇంజనీరింగ్ అక్కడ పనులు  చేపట్టనుంది.  ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్, కాపర్ డ్యామ్ పనులను ఒకదాని వెనుక ఒకటి ప్రారంభిస్తామని సతీష్ బాబు చెప్పారు. రాక్ ఫిల్ డ్యామ్ లో 1. 50 కోట్ల క్యూబిక్ మీటర్ల పనులను చేయాల్సి ఉంది. ఈ పనులను వచ్చే సీజన్లో అంటే 2021 జూన్ నాటికి పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. స్పిల్ వే పనులు 2020 జూన్ నాటికి పూర్తి చేస్తామని వివరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top