అక్కడేం జరుగుతోంది..!

Mass Copying In Rayachoti Exam Centres - Sakshi

అందరికళ్లు రాయచోటిపైనే

పలు సెంటర్లలో కాపీయింగ్‌ జరుగుతున్నట్లు ఆరోపణలు?

కడప ఎడ్యుకేషన్‌: జిల్లాలో అధికారుల కళ్లు రాయచోటి పరీక్షా కేంద్రాలపైనే ఉన్నాయి. గత కొనేళ్ల నుంచి ఇక్కడి కేంద్రాల్లో కాపీయింగ్‌ జోరుగా సాగుతాయనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో పలు సంఘటనలు రుజువు కూడా అయ్యాయి. రాయచోటిలో పరీక్షల సమయానికి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలు సిండికేట్‌ అవుతాయని, పరీక్ష విధులకు వచ్చే సిబ్బంది, స్క్వాడ్‌ సభ్యులను మెయింటెయిన్‌ చేస్తారని ఆరోపణలు ఉన్నాయి. వీటిని అరికట్టాలని డీఈఓ శైలజ ఈ సారి పది పరీక్షలకు డైట్‌ ప్రిన్సిపాల్‌ చంద్రయ్యను స్పెషల్‌ అధికారిగా నియమించారు. ఆయన ప్రతి సెంటర్‌కు ఒక సిట్టింగ్‌ స్క్వాడ్‌ ఏర్పాటు చేశారు. రాయచోటి పట్టణంలో 11 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి.ఒక్కో సెంటర్‌కు ఒక సిట్టింగ్‌ స్క్వాడ్‌ను ఏర్పాటు చేశారు.

అయినా అక్కడక్కడ కాపీయింగ్‌ జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈనెల 15 నుంచి 20వ తేదీనాటికి పరీక్ష విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారే ఆరోపణలతో 8మంది   ఇన్విజిలేటర్లను విధుల నుంచి తొలగించగా... 21వ తేదీ బుధవారం ఒక్కరోజే 9 మంది ఇన్విజిలేటర్లు,  ఇద్దరు చీప్‌ సూపరింటెండెంట్లు,, ఒక డిపార్టుమెంట్‌ అధికారిని పరీక్షల విధుల నుంచి తొలగించారు. మొత్తంగా పరీక్షలు జరిగిన ఆరు రోజుల్లో 20 మందిని తొలగించారంటే పరిస్థితి ఏంటో ఇట్టే అర్థమవుతోంది.విద్యాశాఖ అధికారులు పరీక్షల నిర్వహణకు మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top