విద్యుదాఘాతంతో వివాహిత మృతి | Married women died with Electricity Shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో వివాహిత మృతి

Aug 13 2013 3:41 AM | Updated on Sep 5 2018 2:26 PM

తెగిపడిన విద్యుత్ తీగ తగిలి ఒక వివాహిత మృతి చెందింది. గ్రామానికి చెందిన వేచలపు లక్ష్మి (38) ఇంటి సమీపంలోని పొలాల్లో పశువులకు.

చీడిపల్లి (చీడికాడ), న్యూస్‌లైన్: తెగిపడిన విద్యుత్ తీగ తగిలి ఒక వివాహిత మృతి చెందింది. గ్రామానికి చెందిన వేచలపు లక్ష్మి (38) ఇంటి సమీపంలోని పొలాల్లో పశువులకు గడ్డి కోసేందుకు సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో వెళ్తోంది. రెండు చెరకు తోట ల మధ్య గట్టుపై తెగిపడిన విద్యుత్ తీగను పొరపాటున తాకడంతో విద్యుదాఘాతానికి గురై పెద్దగా కేకలు వేసింది. అవి విన్న భర్త సన్నిబాబు వెళ్లి చూసేసరికే మృతి చెందింది.

ఆది వారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు విద్యుత్ తీగెలపై చెట్టు కొమ్మ విరిగిపడటంతో తెగిపడింది. సంఘటన స్థలా న్ని విద్యుత్ ఏడీఈ సత్యనారాయణ, ఏఈ రవికుమార్  పరిశీలించారు. అప్పటి వరకూ ఇంట్లో తిరిగి అంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందంటూ లక్ష్మి కుటుంబసభ్యులు రోదిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాస్ విలేకరులకు తెలిపారు. మృతురాలికి ఇద్దరు పెళ్లి కాని కుమార్తెలున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement