పార్వతీపురం ప్రభుత్వాసుపత్రిలో మలేరియా జ్వరంతో పి. ఆదిలక్ష్మి(22) అనే వివాహిత గురువారం మృతిచెందింది.
విజయనగరం (పార్వతీపురం) : పార్వతీపురం ప్రభుత్వాసుపత్రిలో మలేరియా జ్వరంతో పి. ఆదిలక్ష్మి(22) అనే వివాహిత గురువారం మృతిచెందింది. బీకేపట్నం గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి తీవ్ర జ్వరంతో బుధవారం ఆసుపత్రిలో చేరింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మృతిచెందిందని కుటుంబసభ్యులు, తోటి గ్రామస్తులు ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు.