వివాహిత ఆత్మహత్య | married woman committed suicide in Anantapur | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్య

Jul 29 2018 12:04 PM | Updated on Jul 29 2018 12:04 PM

తలుపుల: వేపమానిపేట సమీపంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి బంధువులు తెలిపిన మేరకు.. తలుపులమండలం వేపమానిపేటకు చెందిన ఆర్టీసీ మెకానిక్‌ కుళ్లాయప్ప కుమార్తె శిరీష(25)కు తొమ్మిదేళ్ల కిందట ధర్మవరం మండలం నడిమిగడ్డపల్లికి చెందిన వీరనారప్పతో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. మూడు నెలల కిందట భర్తతో గొడవపడి శిరీష తన వేపమానిపేటకు వచ్చి బాబాయి శ్రీనివాసులు ఇంట్లో ఉంటోంది. శనివారం తండ్రి పొలానికి వెళ్లి అక్కడ వేపచెట్టుకు శిరీష ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎస్‌ఐ గోపాలక్రిష్ణ, ఏఎస్‌ఐ ఇస్మాయిల్‌ఖాన్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని తహసీల్దార్‌ శివయ్య పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.  

Advertisement
 
Advertisement
Advertisement