ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య | Married commit suicide in Muttukuru | Sakshi
Sakshi News home page

ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య

Sep 20 2018 10:17 AM | Updated on Sep 20 2018 10:17 AM

Married commit suicide in Muttukuru - Sakshi

ముత్తుకూరు: భర్తపై అనుమానంతో ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ముత్తుకూరు ఎస్సై సాంబశివరావు కథనం ప్రకారం.. ఒడిశా రాష్ట్రం, గంజాం జిల్లా, సాన్కోహ్లి గ్రామానికి చెందిన బంజాకుమార్‌స్వాయి–బాసంతిస్వాయి(24) దంపతులు స్థానిక గురుకుల పాఠశాల ఎదురుగా అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. బంజాకుమార్‌ పోర్టులోని అక్షర ఇండస్ట్రీలో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. డ్యూటీ నుంచి ఆలస్యంగా వచ్చిన భర్తను సోమవారం భార్య నిలదీసింది. అయితే సక్రమంగా సమాధానం చెప్పకుండా మంగళవారం ఉదయం భర్త డ్యూటీపై గుమ్మడిపూండికి వెళ్లిపోయాడు. ప్రశ్నించిన తనను సముదాయించకపోగా, సక్రమంగా బదులివ్వని భర్తపై అనుమానం పెంచుకుంది. రాత్రి ఉరేసుకుని మృతి చెందింది. రైలు దిగే బంజాకుమార్‌ను నెల్లూరు నుంచి తీసుకు వచ్చేందుకు సురేష్‌ అనే స్నేహితుడు మోటారు సైకిల్‌ కోసం ఇంటికి వెళ్లి చూడగా బాసంతి ఉరేసుకుని ఉండడంతో హతాశుడయ్యాడు. భర్త ఇంటికి వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement