వంగవీటి రాధాకు పలువురి అభినందన | Many congratulation to Radha Vangaveeti | Sakshi
Sakshi News home page

వంగవీటి రాధాకు పలువురి అభినందన

May 20 2016 5:49 AM | Updated on May 25 2018 9:20 PM

వంగవీటి రాధాకు పలువురి అభినందన - Sakshi

వంగవీటి రాధాకు పలువురి అభినందన

వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షునిగా నియమితులైన వంగవీటి రాధా కృష్ణను 16వ డివిజన్ రాణిగారితోటకు చెందిన ...

కృష్ణలంక : వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షునిగా నియమితులైన వంగవీటి రాధా   కృష్ణను 16వ డివిజన్ రాణిగారితోటకు చెందిన పలువురు నాయకులు రాఘవయ్య పార్కు సమీపంలోని కార్యాలయంలో గురువారం కలుసుకున్నారు. రాధాకృష్ణకు అభినందనలు తెలిపారు. ఆయన నియామకంతో నగరంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని చెప్పారు.


రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రజల పక్షాన ఉంటూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని నాయకులకు సూచించారు. యువజన విభాగం రాష్ట్ర నాయకులు తంగిరాల రామిరెడ్డి, 16 డివిజన్ నేతలు భిక్షాలరెడ్డి, కుమ్మరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement