ఏలూరు కలెక్టరేట్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం | man suicide attempt at eluru collectorate | Sakshi
Sakshi News home page

ఏలూరు కలెక్టరేట్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

May 23 2016 11:58 AM | Updated on Sep 4 2017 12:46 AM

ఏలూరు కలెక్టరేట్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ఏలూరు కలెక్టరేట్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

రిజర్వాయర్ నిర్మాణం పూర్తయినా పైపులైను పనులకు అధికారులు అనుమతి ఇవ్వనందుకు నిరసనగా ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు.

ఏలూరు సెంట్రల్: రిజర్వాయర్ నిర్మాణం పూర్తయినా పైపులైను పనులకు అధికారులు అనుమతి ఇవ్వనందుకు నిరసనగా ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. పెనుమంట్ర మండలం బట్టలమగుటూరు గ్రామ సర్పంచి ఈలి అనిత భర్త ప్రవీణ్ గ్రామంలో రూ. 40 లక్షల వ్యయంతో రిజర్వాయర్ పనులను చేపట్టాడు.

పనులన్నీ పూర్తయినప్పటికీ గ్రామంలోకి వేయాల్సిన పైపులైన్ విషయంలో అధికారులు అనుమతి ఇవ్వలేదు. వారు కాలయాపన చేస్తున్నారని విసుగుచెందిన ప్రవీణ్.. సోమవారం కలెక్టరేట్‌కు చేరుకున్నాడు. కలెక్టర్ భాస్కర్ సమక్షంలోనే ఒంటిపై కిరోసిన్ పోసుకుని, నిప్పంటించుకోబోయాడు. పోలీసులు జోక్యం చేసుకుని అతనిని వారించారు. విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లటంతో ఆయన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement