కాలువలో పడి వ్యక్తి గల్లంతు | man missed in a canal | Sakshi
Sakshi News home page

కాలువలో పడి వ్యక్తి గల్లంతు

Feb 17 2015 8:31 PM | Updated on Sep 2 2017 9:29 PM

ముఖం కడుక్కుందామని కాలువలో దిగిన వ్యక్తి ప్రమాదవశాత్తు జారిపడి గల్లంతయ్యాడు.

అనంతపురం: ముఖం కడుక్కుందామని కాలువలో దిగిన వ్యక్తి ప్రమాదవశాత్తు జారిపడి గల్లంతయ్యాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం వెంకటాపురం గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. అనంతపురం మండలం తాడ్చర్ల గ్రామానికి చెందిన పుల్లయ్య(55) కూలిపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం ఉదయం పనికోసం కేకే అగ్రహారం గ్రామానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో కాళ్లు చేతులు కడుక్కోవడానికి వెంకటాపురం సమీపంలోని హెచ్‌ఎల్‌సీ కాలువలోకి దిగాడు. ప్రమాదవశాత్తు అందులో జారిపడి నిళ్లలో గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గల్లంతయిన వ్యక్తి కోసం వెతుకులాట ప్రారంభించారు.
(బుక్కరాయసముద్రం)

Advertisement
 
Advertisement
Advertisement