మైలవరం మండలం చంద్రాల గ్రామంలో శనివారం విషాదం చోటుచేసుకుంది.
చెట్టు పైనుంచి పడి యువకుడి మృతి
Apr 9 2016 3:11 PM | Updated on Sep 3 2017 9:33 PM
మైలవరం (కృష్ణా జిల్లా) : మైలవరం మండలం చంద్రాల గ్రామంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. తాటి ముంజల కోసం తాటి చెట్టు ఎక్కిన సత్యాల గోపాలరావు(27) అనే యువకుడు ప్రమాదవశాత్తూ జారి కింద పడ్డాడు. తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు.
Advertisement


