ఫ్యాన్సీ నెంబరు అంటే చాలు.. అందరికీ ఎక్కడ లేని మోజు. ఎమ్మెల్యేలు కూడా ఇందుకు అతీతులు కారు.
ఫ్యాన్సీ నెంబరు అంటే చాలు.. అందరికీ ఎక్కడ లేని మోజు. ఎమ్మెల్యేలు కూడా ఇందుకు అతీతులు కారు. దీన్ని సొమ్ము చేసుకుంటూ.. ఐదుగురు ఎమ్మెల్యేలు సహా పలువురిని ఫ్యాన్సీ నెంబర్ల పేరుతో మోసం చేసిన హైటెక్ మోసగాడిని ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. మద్దుల బాబు అలియాస్ దీపక్ అనే ఈ మోసగాడి నుంచి రూ. 12.20 లక్షలు రికవరీ చేశారు.
చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఖాతా నుంచి రూ. 9.27 లక్షలు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నుంచి రూ. 4 లక్షలు, పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ నుంచి రూ. 64 వేలు, గోపాలపురం ఎమ్మెల్యే నుంచి రూ. 42 వేలు, నమాజీ ఎమ్మెల్యే ఆనం నుంచి రూ. 15 వేలు, ఏలూరు మాజీ ఎమ్మెల్యే నుంచి రూ. 24వేల మొత్తాన్ని నిందితుడు స్వాహా చేశాడు. తాను ప్రముఖ సెల్ కంపెనీకి చెందిన సీఈవోనని చెప్పుకొని అతడు వీరందరినీ బుట్టలో వేసుకున్నాడు. ఫేస్బుక్ ద్వారా కథ నడిపి.. ఆన్లైన్లో డబ్బు డిపాజిట్ చేయించాడు. నిందితుడిపై ప్రకాశం జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి. అతడిని ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీకాంత్ మీడియా ముందు ప్రవేశపెట్టారు.