వివాహితను ఫోన్‌లో వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఏలూరు: వివాహితను ఫోన్‌లో వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో శనివారం చోటుచేసుకుంది.
ఏలూరులోని పుష్పలీలానగర్‌కు చెందిన వివాహిత(21)కు గత కొన్ని రోజులుగా తూర్పుగోదావరికి చెందిన రవీంద్ర అనే వ్యక్తి ఫోన్ చేస్తూ వేధిస్తున్నాడు. ఆమె ఫోన్ ఎత్తకుండా.. భర్తకు ఇచ్చినా.. ‘నీ పెళ్లానికి ఇవ్వు దానితో మాట్లాడాలి.. అది నాది, నేను దాన్ని తీసుకెళ్తా’ అంటూ బెదిరిస్తున్నాడు. దీంతో భార్యాభర్తలు పోలీసులను ఆశ్రయించారు.