తేనెటీగల దాడి నుంచి తప్పించుకోవడానికి చెరువులోకి దూకాడు ఓ యువకుడు.
విశాఖపట్నం : తేనెటీగల దాడి నుంచి తప్పించుకోవడానికి చెరువులోకి దూకాడు ఓ యువకుడు. అయితే అతనికి ఈత రాకపోవడంతో నీళ్లలో ఊపిరాడక మృతి చెందాడు. ఈ సంఘటన విశాఖ జిల్లా ఎస్.రాయవరం మండలంలో గురువారం చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం... పెదగమనూరు గ్రామానికి చెందిన కె.ప్రసాద్(35) గురువారం పొలం పనులుకు వెళ్లి వస్తుండగా తేనెటీగలు దాడి చేశాయి. వాటి నుంచి తప్పించుకునేందుకు అతను చెరువులో దూకాడు. ఈత రాకపోవడంతో ఊపిరాడక మృతి చెందాడు.