మహీధరుడి సేవాభావం.. పోతుల స్వలాభం

Magunta Mahidhar Reddy Vs Pothula Ramarao - Sakshi

సాక్షి, కందుకూరు (ప్రకాశం): ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో విజయం కోసం వివిధ పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా పోరాడుతున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సరైన అభ్యర్థిని ఎంచుకునే బాధ్యత కూడా ఓటర్లపై ఉంది. ఏ పార్టీ అయితే తమకు మేలు చేస్తుంది, ఎవరైతే తమకు అండగా ఉండి తమ సంక్షేమాన్ని, అభివృద్ధికి కృషి చేస్తారని భావిస్తారో వారిని ఎన్నుకోనున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రధాన పార్టీలైన వైఎస్సార్‌ సీపీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గుణగణాలు ఇలా...

సుపరిచితం మానుగుంట చరితం
నియోజకవర్గంలో దశాబ్దాల తరబడి ప్రజల మేలు కోసం కృషి చేస్తున్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి
► దాదాపు మూడు దశాబ్దాలుగా ప్రత్యక్ష రాజకీయ అనుభవం.
మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మహీధర్‌రెడ్డి ఒకసారి మంత్రిగాను పనిచేశారు. 
నియోజకవర్గానికి చెందిన వ్యక్తి, స్థానికుడు.
అధికారంలో ఉన్నా లేకపోయినా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే నేతగా గుర్తింపు. 
రాజకీయాల్లో ఎంత ఎదిగినా సొంత ఊరిని వదిలని నేతగా గుర్తింపు, ఇప్పటికీ గ్రామంలో సామాన్యుడిగానే నివసిస్తున్నారు. 
సాదారణ రైతు మాదిరి తన వ్యవసాయం తానే చూసుకుంటారు. 
ప్రజా సమస్యలపై తనదైన శైలిలో స్పందించి వాటి పరిష్కారానికి కృషి చేయగల నేర్పరి 
ఎమ్మెల్యేగా, మంత్రిగా నియోజకవర్గ అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు.
కందుకూరు పట్టణం తాగునీటి సమస్యను పరిష్కరించారే మంచి పేరు
అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటారనే భావన, నమ్మకం ఉన్న నేత. 
నియోజకవర్గంలో శాంతి, భద్రతలను నెలకొల్పడంలో తనదైన ముద్ర వేశారు. 
సమస్యపై ఎవరి వెళ్లినా ముక్కుసూటిగా సమాధానం చెప్పడం, వ్యక్తిగత ప్రయోజనాల కంటే సామాజిక ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే నాయకుడు
ప్రజా సమస్యలపై పోరాడటంలో తెలివైన నేతగా, ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడంలో, అభివృద్ధి చేయడంలో బహు ప్రజ్ఞాశాలి 
సంఘ విద్రోహ శక్తులను దరి చేరనీయరు.
పాలనలో పరాయి వ్యక్తుల ప్రమేయం లేకుండా అవగాహన, క్రమశిక్షణ, అంకితభావం కలిగిన నాయకుడు.

రాజకీయ అందలం నుంచి పోతుల రామారావు
సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది.
సమీప నియోజకవర్గం కొండపి గ్రామానికి చెందిన నేత. స్థానికుడు కాదు
రాజకీయాలను వ్యాపార దృక్పధంలోనే వినియోగిస్తారని ఉంది. 
ఎమ్మెల్యేగా నియోజకవర్గం కంటే వ్యాపారాలకే అధిక ప్రాధాన్యం ఇస్తారు.
ముభావి, ప్రజా సమస్యలపై తక్షణం స్పందించని నేతగా గుర్తింపు.
అధికారంలో ఉన్నా ప్రభుత్వం నుంచి నిధులు సాధించలేదు.
విషయంలో చురుగ్గా ఉండరనే ముద్ర 
ఎమ్మెల్యేగా ఆయన అధికారంలో ఉన్నా పాలన అంతా ఆయన కుటుంబ సభ్యుల, అనుచరుల చేతుల్లోనే సాగుతుంది, 
సమస్యలపై వెళ్లే ప్రజలు ముందుగా కుటుంబ సభ్యుల్ని ప్రసన్నం చేసుకోవాల్సిన దుస్థితి
వ్యాపారాల నిమిత్తం ఎక్కువగా విదేశాల్లో ఉంటారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top