వర్షాలు లేక అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది.
విశాఖపట్నం: వర్షాలు లేక అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. ఈ నెల 28 నాటికి పశ్చిమ మధ్య వాయవ్య బంగాళాఖాతం మధ్య అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 3.1 అడుగుల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వెల్లడించింది.
రానున్న 24 గంటల్లో ఇది బలపడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో మోస్తరు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్రా, తెలంగాణ మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతున్నట్టు వెల్లడించింది.