ప్రేమికుడే చంపేశాడు..!

Lover Killed His Girl Friend  - Sakshi

స్నేహితుల సహాయంతో ప్రియురాలిని కడతేర్చిన వైనం

ముగ్గురు నిందితులను జువైనల్‌ హోంకు తరలించిన పోలీసులు

సాక్షి,చోడవరం(విశాఖపట్టణం): మండలంలో సంచలనం రేపిన ఇంటర్ విద్యార్థిని పద్మావతి(17) హత్య కేసులో ముగ్గురు మైనర్లను అరెస్ట్ చేసి, జువైనల్‌హోంకు  తరలించినట్లు అనకాపల్లి డీఎస్పీ కేవీ రమణ మీడియాకు తెలిపారు. ప్రియుడు రాజాప్రసన్నకుమార్ తన స్నేహితులు శ్రీనివాస్, సాయిశంకర్‌లతో కలసి పథకం ప్రకారం ఈ హత్య చేశాడని ఆయన చెప్పారు.
 
పోలీసులు చెప్పిన కథనం ప్రకారం..  పద్మావతి, ఆమె ఇంటి ఎదురుగా ఉంటున్న తుంపాల రాజా ప్రసన్నకుమార్ లు గత ​కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.  ప్రియురాలు గర్భవతి అయిన విషయం తెలుసుకున్న రాజాప్రసన్నకుమార్ అబార్షన్ చేయించుకోవాలంటూ ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. దీనికి  పద్మావతి  నిరాకరించడంతో ప్రియుడు రాజాప్రసన్నకుమార్ కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో తన స్నేహితుల సహకారంతో చోడవరం శివారులోని ఫారెస్టు డిపో సమీపంలోకి పద్మావతిని తీసుకెళ్లి ఇనుప రాడ్‌తో తలపై బలంగా కొట్టి, గొంతు నులిమి చంపాడు. అనంతరం   పెట్రోల్ పోసి తగలబెట్టాడు. నిందితులపై ఐపీసీ సెక్షన్‌ 302, 201,376,379, నిర్భయ, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశామని డీఎస్పీ తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top