వైఎస్సార్‌సీపీ ఓట్లు గల్లంతు | lost the YSRCP votes | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ ఓట్లు గల్లంతు

Feb 10 2018 1:42 AM | Updated on Aug 14 2018 4:32 PM

 lost the  YSRCP votes  - Sakshi

వైఎస్సార్‌సీపీ

సాక్షి, హైదరాబాద్‌: ఏపీలో వైఎస్సార్‌సీపీ ఓట్లు గల్లంతు అవుతున్నాయని ఆ పార్టీ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వారు శుక్రవారం హైదరాబాద్‌లో ఎన్నికల అధికారి సిసోడియాను నేతలు కలిసి ఏపీ ఓటర్ల జాబితాలో అక్రమంగా ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు చేశారు.

తాను గుంటూరు జిల్లా, నరసరావుపేటలోని 150 నంబర్‌ పోలింగ్‌ బూత్‌లో ఓటర్‌ గా ఉండేవాడినని, ప్రస్తుతం తన ఓటు 162 పోలింగ్‌ బూత్‌లోకి మారిందని గోపిరెడ్డి తెలిపారు. ఇలా నరసరావుపేటలో 21 వేలకు పైగా ఓటర్లను సర్వే పేరుతో ఇష్టారీతిన ఇతర బూత్‌లకు మార్చారని విమర్శించారు. సత్తెనపల్లిలో ప్రతి నాలుగు ఓట్లలో ఒక ఓటు తొలగించారని అంబటి రాంబాబు మండిపడ్డారు.     

Advertisement
 
Advertisement
Advertisement