అదుపుతప్పిన ఓ లారీ ఇంట్లోకి దూసుకెళ్లడంతో ముగ్గురికి గాయాలు అయ్యాయి.
అదుపుతప్పిన ఓ లారీ ఇంట్లోకి దూసుకెళ్లడంతో ముగ్గురికి గాయాలు అయ్యాయి. గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలో శనివారం తెల్లవారుజామున 3.30గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వినుకొండ నుంచి అద్దంకి వైపు వెళుతున్న లారీ మార్కెట్ యార్డ్ ప్రాంతంలో మూలమలుపు వద్ద అదుపుతప్పడంతో పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇంటి బయట పడుకున్న ముగ్గురికి గాయాలు అయ్యాయి. ఇల్లు ధ్వంసం అయింది. క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ పోలీసులకు లొంగిపోయాడు.