వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల శ్రీశైలం డ్యామ్ ముట్టడి | Krishna water board set up at Kurnool, demands YSR Congress Party MLAs | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల శ్రీశైలం డ్యామ్ ముట్టడి

Aug 7 2014 1:16 PM | Updated on May 29 2018 2:55 PM

రాష్ట్రంలో రైతుల శ్రేయస్సు కోసం, కర్నూలు జిల్లాకు తాగు నీరు అందించేందుకు ఎంతవరకైనా పోరాడతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.

హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల శ్రేయస్సు కోసం, కర్నూలు జిల్లాకు తాగు నీరు అందించేందుకు ఎంతవరకైనా పోరాడతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. గురువారం కర్నూలు జిల్లాలోని శ్రీశైలం డ్యామ్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ముట్టడించారు. ఈ సందర్భంగా వారు కృష్ణా వాటర్ బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

డ్యామ్లో నీటి మట్టం 854 అడుగులు ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. జీవో 69ని రద్దు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాయలసీమలోని నాలుగు జిల్లాలకు చెందిన వైఎస్ఆర్ సీపీ ప్రజా ప్రతినిధులతోపాటు కార్యకర్తలు భారీగా శ్రీశైలం డ్యామ్ ముట్టడి కార్యక్రమానికి హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement