రూ.1.50 కోట్ల చెక్ అందజేసిన కృష్ణ | Krishna gave a cheque of Rs. 1.5 Crore | Sakshi
Sakshi News home page

రూ.1.50 కోట్ల చెక్ అందజేసిన కృష్ణ

Oct 20 2014 3:49 PM | Updated on Sep 2 2017 3:10 PM

కృష్ణ

కృష్ణ

హుదూద్ తుపాను బాధితుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ నిమిత్తం సినిమా నటుడు ఘట్టమనేని కృష్ణ ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కోటి 50 లక్షల రూపాయలు చెక్కుల రూపంలో అందజేశారు.

హైదరాబాద్: హుదూద్ తుపాను బాధితుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్కు సినిమా నటుడు ఘట్టమనేని కృష్ణ ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కోటి 50 లక్షల రూపాయలు  చెక్కుల రూపంలో అందజేశారు. ఈ రోజు కృష్ణ-విజయనిర్మల దంపతులు సీఎంను కలిశారు. తమ అల్లుడు, గుంటూరు లోక్సభ సభ్యుడు గల్లా జయదేవ్ వారి ఫ్యాక్టరీ తరపున కోటి రూపాయలు ఇచ్చినట్లు తెలిపారు.  ఆ కోటి రూపాయలు కాకుండా ఎంపి నిధుల నుంచి మరో లక్షల రూపాయలు కూడా ఇచ్చినట్లు చెప్పారు.  తమ కుటుంబం తరపున 50 లక్షల రూపాయలు అందజేసినట్లు తెలిపారు. మహేష్ బాబు 25 లక్షలు, విజయనిర్మల 10 లక్షలు, తాను 15 లక్షల రూపాయలు ఇచ్చినట్లు వివరించారు.

అనంతరం కృష్ణ మాట్లాడుతూ  సీఎం చంద్రబాబు నాయుడు చాలా సంతోషించినట్లు తెలిపారు. మహేష్ బాబు హాంకాంగ్ షూటింగ్లో ఉన్నందున రాలేకపోయినట్లు తెలిపారు. విశాఖతో తనకు ప్రత్యేక అనుబంధం ఉన్నట్లు చెప్పారు. విశాఖ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానన్నారు. తుపాను బాధితులకు తన సానుభూతి తెలిపారు.
**

Advertisement
 
Advertisement
Advertisement