మీడియా ముందు వాపోయిన యజమాని

Krishna District TDP Leaders Fail To Pay Current Bill Dues - Sakshi

సాక్షి, విజయవాడ : పట్టణంలోని మహాత్మాగాంధీ రోడ్డులోని పాత కృష్ణా జిల్లా టీడీపీ కార్యాలయానికి సంబంధించిన కరెంట్ బిల్లు చెల్లించకుండా తెలుగు దేశం నేతలు వెళ్లిపోయినట్లు యజమాని పొట్లూరి శ్రీధర్ తెలిపారు. రెండు నెలల నుంచి కరెంట్ బిల్లుల గురించి వారి వెంట తిరుగుతున్నా ఎలాంటి స్పందన లేదని శ్రీధర్ మీడియా ముందు వాపోయారు. కరెంట్ బిల్లు లక్షల రూపాయల బకాయిలు ఉంటే విద్యుత్ శాఖ అధికారులు ఇప్పటివరకు ఎందుకు ఊరుకున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు శ్రీధర్‌.

ఇప్పటికైనా టీడీపీ నేతలు విద్యుత్ బకాయి బిల్లులు చెల్లించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని, ఎటువంటి పోరాటానికైనా సిద్ధపడతానని శ్రీధర్ హెచ్చరిస్తున్నారు. గతంలో టీడీపీ ఆఫీసు లీజు విషయంలో కూడా లక్షలాది రూపాయలు పెండింగ్ పెట్టి చివరకు విజయవాడకు చెందిన ఇద్దరు పారిశ్రామికవేత్తలతో సెటిల్ మెంట్ చేయించుకున్నట్లు తెలుస్తోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top