కొండపల్లి ఆయిల్‌ డిపో వద్ద ఆందోళన | Kondapalli concern at the oil depot | Sakshi
Sakshi News home page

కొండపల్లి ఆయిల్‌ డిపో వద్ద ఆందోళన

Apr 4 2017 11:32 AM | Updated on Sep 5 2017 7:56 AM

కొండపల్లి డిపోవద్ద మంగళవారం ఉదయం ఆయిల్‌ ట్యాంకర్లను నిలిపివేశారు. ఇంధన డిపోగేట్ల వద్ద డ్రైవర్లు, యజమానులు బైఠాయించి ఆందోళన చేపట్టారు.

విజయవాడ: కొండపల్లి డిపోవద్ద మంగళవారం ఉదయం ఆయిల్‌ ట్యాంకర్లను నిలిపివేశారు. ఇంధన డిపోగేట్ల వద్ద డ్రైవర్లు, యజమానులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. బీమా ప్రీమియం డీజిల్‌పై అదనపు పన్నును తగ్గించాలని డిమాండ్‌ చేశారు. లారీ యజమానుల సమ్మె ఆరోరోజులో భాగంగా ఈ ఆందోళన చేపట్టారు.
 
ఈ ఆందోళనకు పెట్రోల్‌ ట్యాంకర్ల సంఘం మద్దతు తెలిపింది. దీనిలో భాగంగా నేడు పాక్షికంగా ట్యాంకర్లను నిలిపివేసినట్లు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి తెలిపారు. డిమాండ్లను పరిష్కరించకపోతే పూర్తి స్థాయిలో ఇంధన సరఫరాను అడ్డుకుంటామని ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement