సీఎం కిరణ్ కుమార్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయం | komatireddy warns kiran kumar reddy | Sakshi
Sakshi News home page

సీఎం కిరణ్ కుమార్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయం

Feb 10 2014 6:44 PM | Updated on Jul 29 2019 5:31 PM

సీఎం కిరణ్ కుమార్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయం - Sakshi

సీఎం కిరణ్ కుమార్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయం

రాష్ట్ర విభజనకు సంబంధించి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అనుసరిస్తున్న వైఖరిపై మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు.

నల్గొండ: రాష్ట్ర విభజనకు సంబంధించి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అనుసరిస్తున్న వైఖరిపై మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. అవినీతి ఫైళ్లపై సీఎం కిరణ్ సంతకాలు రోజురోజూకు పెరిగిపోతున్నాయని విమర్శించారు. ఈ సందర్భంగా సోమవారం మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి.. అవినీతి పరుడైన సీఎంను జైలుకు పంపి తీరుతామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దగ్గరపడుతున్న కొద్దీ..సీఎం అవినీతి ఫైళ్లపై సంతకాలు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు.సీఎంతో సహా సీమాంధ్రలో ఉన్న మరికొందరు నేతలు కూడా జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని కోమటిరెడ్డి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement