దిగ్విజయ్‌సింగ్‌ను కలిసిన కోమటిరెడ్డి | Komatireddy meeting with the Digvijay Singh | Sakshi
Sakshi News home page

దిగ్విజయ్‌సింగ్‌ను కలిసిన కోమటిరెడ్డి

Dec 13 2013 2:50 AM | Updated on Aug 14 2018 3:55 PM

దిగ్విజయ్‌సింగ్‌ను కలిసిన కోమటిరెడ్డి - Sakshi

దిగ్విజయ్‌సింగ్‌ను కలిసిన కోమటిరెడ్డి

రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి, కేంద్ర మంత్రి దిగ్విజయ్‌సింగ్‌ను గురువారం మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కలుసుకున్నారు.

నల్లగొండ టౌన్, న్యూస్‌లైన్: రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి, కేంద్ర మంత్రి దిగ్విజయ్‌సింగ్‌ను గురువారం మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కలుసుకున్నారు. హైదరాబాద్‌లోని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నివాసంలో దిగ్విజయ్‌సింగ్‌ను కోమటిరెడ్డితో పాటు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకటనారాయణగౌడ్‌లు కలిశారు. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు కృషి చేసినందుకు  ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తెలంగాణ ప్రక్రియను  పూర్తి చేయాలని వారు కోరారు.

 తెలంగాణను ఇచ్చినందుకు పార్టీ ఆధినేత్రి సోనియాగాంధీకి తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుకు సహకరించినందుకు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు  కృతజ్ఞతలు తెలి పారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గుమ్ముల మోహన్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వంగూరి లక్ష్మయ్య, సర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్య క్షుడు పనస శంకర్‌గౌడ్ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement