కిరోసిన్ పోసి నిప్పంటించాడు.. | Kerosene oil   Fire .. | Sakshi
Sakshi News home page

కిరోసిన్ పోసి నిప్పంటించాడు..

Mar 12 2014 2:49 AM | Updated on Sep 2 2017 4:35 AM

కిరోసిన్ పోసి  నిప్పంటించాడు..

కిరోసిన్ పోసి నిప్పంటించాడు..

ఆస్తి తగాదా నేపథ్యంలో వృద్ధురాలిపై ఓ వ్యక్తి కిరోసిన్ పోసి నిప్పంటించాడు.

 ఆస్తి తగాదా నేపథ్యంలో వృద్ధురాలిపై ఓ వ్యక్తి కిరోసిన్ పోసి నిప్పంటించాడు. పట్టపగలు వృద్ధురాలి ఇంటికొచ్చి మరీ ఈ దారుణానికి పాల్పడ్డాడు. చందర్లపాడులోని పాత ఇండియన్ బ్యాంకు వీధిలో మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది. స్థానికంగా నివాసముంటున్న పాపచర్ల సుశీల (85)కు ఓ స్థలానికి సంబంధించి అదే ప్రాంతానికి చెందిన నెట్టెం జానకిరామయ్యతో వివాదం ఉంది.

ఈ నేపథ్యంలో వృద్ధురాలు మంగళవారం ఉదయం ఇంట్లో ఉండగా  జానకిరామయ్య వచ్చి కిరోసిన్ పోసి నిప్పంటించి వెళ్లిపోయాడు. ఎదురింట్లో ఉన్న మహిళ ఈ ఘటన చూసి హుటాహుటిన వచ్చి మంటలు ఆర్పింది. వెంటనే 108 అంబులెన్సుకు, క్షతగాత్రురాలి మనవడికి ఫోన్ చేసింది. అంబులెన్స్ సిబ్బంది వచ్చి ఆమెను వెంటనే నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు.

ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సుశీల తనకు స్థలం అమ్మినట్లు జానకిరామయ్య కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసులో తీర్పు సుశీలకు అనుకూలంగా వచ్చింది. దీనిని సవాలు చేస్తూ అతడు జిల్లా కోర్టులో అప్పీల్ చేశాడు. ఈ నేపథ్యంలో ఉదయం అతడు తనపై కిరోసిన్ పోసి నిప్పంటించాడని సుశీల పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. ఈ మేరకు జానకిరామయ్యపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై ఎల్.రమేష్ తెలిపారు. సుశీలకు ఐదుగురు ఆడపిల్లలు ఉన్నారు. వారంతా పెళ్లిళ్లయి వేర్వేరు గ్రామాల్లో నివాసం ఉంటున్నారు. ఆమె భర్త 30 ఏళ్ల కిందట మరణించాడు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement