కేసీఆర్కు జడ్ప్లస్ అయితే సీమాంధ్రులకు ఎంత? | kcr z plus security, what about Seemandhra people security : Srinivasaraju | Sakshi
Sakshi News home page

కేసీఆర్కు జడ్ప్లస్ అయితే సీమాంధ్రులకు ఎంత?

Aug 17 2013 2:12 PM | Updated on Apr 7 2019 3:34 PM

హైదరాబాద్ లోని సీమాంధ్రుల భద్రతపై స్ఫష్టత వచ్చే వరకు విభజన ప్రక్రియ చేపట్టకూడదని తెలంగాణ సెటిలర్స్ అధ్యక్షుడు శ్రీనివాసరాజు సర్కార్ను డిమాండ్ చేశారు.

హైదరాబాద్ నగరంలో ఉండే సీమాంధ్రుల భద్రతపై స్ఫష్టత వచ్చే వరకు విభజన ప్రక్రియ చేపట్టకూడదని తెలంగాణ సెటిలర్స్ ఫ్రంట్ అధ్యక్షుడు శ్రీనివాసరాజు యూపీఏ సర్కార్ను డిమాండ్ చేశారు. శనివారం ఆయన హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.

 

తెలంగాణ ప్రాంతంలోనే ప్రముఖ నేత అయిన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్కు జెడ్ప్లస్ భద్రత కావాలంటే... హైదరాబాద్ నగరంలో నివసించే సీమాంధ్రులకు ఎంత రక్షణ కావాల్సి ఉంటుందని  అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట విభజనకు వ్యతిరేకంగా ఈ నెల 31, సెప్టెంబర్ 1వ తేదీలలో కూకట్పల్లిలో దీక్ష చేపట్టనున్నట్లు శ్రీనివాసరాజు వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement