కాపు కార్పొరేషన్ ద్వారా జిల్లాలోని బలిజ కులస్తులందరికీ రుణాలు మంజూరు చేయాలని బలిజ కులస్తుల సంక్షేమ ...
తిరుపతి ప్రెస్‌క్లబ్: కాపు కార్పొరేషన్ ద్వారా జిల్లాలోని బలిజ కులస్తులందరికీ రుణాలు మంజూరు చేయాలని బలిజ కులస్తుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజురాయల్ కోరారు. శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాపుకార్పొరేషన్‌లో రుణాల కోసం అర్హత వయస్సు 20 నుంచి 50 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు.
మంజునాథ్ కమిషన్‌ను వేగవంతం చేసి, ఏడు నెలల్లో కాపులను బీసీలో చేర్చాలన్నారు. 2016-17 బడ్జెట్‌లో కాపులకు రూ.1000 కోట్లు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు శ్రీనివాసులు, వెంకటరత్నం, వెంకటరమణ, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.