‘సోమిరెడ్డి లాఠీకి ఎక్కువ.. తుటాకు తక్కువ’
వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అధికార టీడీపీని తీవ్రంగా విమర్శించారు.
నెల్లూరు: వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అధికార టీడీపీని తీవ్రంగా విమర్శించారు. టీడీపీలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆకులో అరటిపండు లాంటివారని ఎద్దేవా చేశారు. సోమిరెడ్డి లాఠీకి ఎక్కువ.. తుటాకు తక్కువ అని కాకాని అన్నారు. చంద్రబాబుది హత్యలు చేయించిన చరిత్ర అని ఆయన అన్నారు. రంగాతో పాటు ఒక జర్నలిస్ట్ను హత్య చేయించిన చరిత్ర చంద్రబాబుదని ఆయన ఆరోపించారు. రాజీనామా చేసిన తరువాత వైఎస్ఆర్ సీపీలో చేరాలని శిల్పా చక్రపాణి రెడ్డికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పరన్నారు.
చక్రపాణి రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైఎస్ జగన్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సీపీలోకి చేరిన విషయం తెలిసిందే. చంద్రబాబు మాత్రం కోట్ల రూపాయలు ఇచ్చి ఎమ్మెల్యేలను కొన్నరని ఆయన పేర్కొన్నారు. మంత్రులు, టీడీపీ నేతలకు మతిభ్రమించిందని అన్నారు. సోమిరెడ్డి లాంటి వారికి ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదని కాకాని అన్నారు. నంద్యాల ఉప ఎన్నిక సందర్బంగా జిల్లాలో రాజకీయ వాతావరణ వెడెక్కింది.