
రైలుమార్గం ప్రారంభం: 2010
బడ్జెట్‌లో ఆమోదం: 2008 – 09
అంచనా వ్యయం: రూ.1000 కోట్లు
రైలుమార్గం: 258 కిలోమీటర్లు
నిర్మాణం : నాలుగుదశల్లో ...
భూసేకరణ: రూ.199.92 కోట్లు
బడ్జెట్: రూ.240 కోట్లు
రాజంపేట: కడప–బెంగళూరు మధ్య రైలు మార్గానికి సరిగ్గా ఏడేళ్ల కిందట శంకుస్ధాపన రాయిపడింది. అప్పటి నుంచి భూసేకరణ..నిధుల లేమి తదితర అం శాలు వెంటాడుతున్నాయి. దీనికి మహానేత దివంగత వైఎస్ రాజఖరరెడ్డి 2008లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి 50 శాతం వాటా కేటాయించేలా చేశారు.ఆయన మరణాంతరం పనులునత్తనడకన సాగుతున్నాయి. ఈ రైలుమార్గం నిర్మాణానికి 2010 సెప్టెంబరు 1న అప్పటి రైల్వేశాఖ మంత్రి మునియప్ప శ్రీకారం చుట్టారు.దీనికి 2008–2009 బడ్జెట్‌లో ఆమోదం లభించింది. రూ.1000 కోట్ల అంచనావ్యయంతో పనులు ప్రారంభమయ్యాయి. 258 కిలో మీటర మేర నిర్మాణానికి 1,531 ఎకరాల భూమి సేకరించారు. ఐదేళ్లలో పూర్తిచేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. అయితే నేటికీ లక్ష్యం నెరవేరలేదు.
రూ.100కోట్ల వ్యయంతో ఆర్‌ఐడీసీ
రైల్‌నెట్‌వర్క్ విస్తరణలో భాగంగా రైల్వేశాఖ, రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంలో ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు ప్రణాళికలు, సమగ్ర నివేదికలు రూపొందిం చాయి. అందులో భాగంగా రూ.వందకోట్లతో రైల్ ఇన్‌ఫ్రాస్టక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటైంది.ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. ఆర్‌ఐడీసీలోకి కడప–బెంగళూరు రైలుమార్గాన్ని చేర్చారు.
మొదటిదశలోనే.....
కడప–బెంగళూరు రైలుమార్గాన్ని నాలు గుదశల్లో నిర్మాణం చేపట్టేలా నిర్ణయించారు. మొదటిదశలో రూ.153 కోట్లు కేటాయింపులు జరిగాయి. భూసే కరణకు సంబంధించి రూ.89కోట్లలో రూ.20కోట్లు వ్యయం చేశారు. ఈ దశలో 21.8కిలోమీటర్ల వరకు చేపట్టారు. 311.84 ఎకరాల భూమిని సేకరించారు. 54 చిన్నవి, ఆరుపెద్ద బ్రిడ్జిల నిర్మాణం చేపట్టారు. 199.2కోట్లు భూసేకరణ కోసం వ్యయంచేశారు.
ముందుకుసాగని మిగిలిన దశలు..
రెండవదశలో పెండ్లిమర్రి–రాయచోటి, రాయచోటి టు ఊయ్యలపాడు (చిత్తూరు),మూడోదశలో మదనపల్లెరోడ్డు టు మదగట్ట (ఆంధ్రప్రదేశ్ సరిహద్దు) మదగట్ట టు ముల్‌బాగల్ (కర్ణాటక సరిహద్దు) నాలుగదశలో ముల్‌బాగల్ టు కోలార్ వరకు నిర్మా ణం చేపట్టేలా కడప–బెంగళూరు రైల్వేలైన్‌కు రూపకల్పన చేశారు. అయితే ఇది పూర్తి కావడానికి ఇంకెన్నాళ్లుపడుతుందోనని జిల్లావాసులు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.