ఎయిర్పోర్ట్కు తాళ్లపాక అన్నమయ్య పేరు ! | Kadapa airport inauguration by chandrababu and venkaiah naidu | Sakshi
Sakshi News home page

ఎయిర్పోర్ట్కు తాళ్లపాక అన్నమయ్య పేరు !

Jun 7 2015 12:08 PM | Updated on Sep 3 2017 3:23 AM

ఎయిర్పోర్ట్కు తాళ్లపాక అన్నమయ్య పేరు !

ఎయిర్పోర్ట్కు తాళ్లపాక అన్నమయ్య పేరు !

కడప ఎయిర్పోర్ట్కు పదకవితా పితామహుడు తాళపాక అన్నమయ్య పేరు పరిశీలనలో ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు తెలిపారు.

కడప: కడప ఎయిర్పోర్ట్కు పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య పేరు పరిశీలనలో ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు తెలిపారు. ఆదివారం కడపలో ఎయిర్పోర్ట్ను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలసి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా కడప - బెంగళూరు విమాన సర్వీసును చంద్రబాబు ప్రారంభించారు.

అయితే అంతకుముందు  విమానాశ్రయంలోకి బీజేపీ నేతలు, కార్యకర్తలు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులకు, బీజేపీ నేతలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానిక రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల జోక్యంతో బీజేపీ నేతలు సద్దుమణిగారు.

Advertisement
 
Advertisement
Advertisement