'అసాంఘిక శక్తులు అధికమయ్యాయి' | k haribabu takes on ap police officialsl | Sakshi
Sakshi News home page

'అసాంఘిక శక్తులు అధికమయ్యాయి'

Jan 20 2015 2:48 PM | Updated on Mar 29 2019 5:35 PM

'అసాంఘిక శక్తులు అధికమయ్యాయి' - Sakshi

'అసాంఘిక శక్తులు అధికమయ్యాయి'

శాంతి భద్రతల కోసం అప్లికేషన్స్ ను ఉపయోగించే అవసరం లేకుండా చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం లోక్సభ సభ్యుడు కె.హరిబాబు పోలీసు ఉన్నతాధికారుకు సూచించారు.

విశాఖపట్నం: శాంతి భద్రతల కోసం అప్లికేషన్స్ ను ఉపయోగించే అవసరం లేకుండా చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం లోక్సభ సభ్యుడు కె.హరిబాబు పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. మహిళల భద్రత కోసం ఐక్లిక్ విధానాన్ని మంగళవారం విశాఖపట్నంలో  ఏపీ హోం మంత్రి చినరాజప్ప ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో  పాల్గొన్న హరిబాబు మాట్లాడుతూ...ప్రజల్లో మానసిక స్థైర్యాన్ని కలిగించాలని ఆయన పోలీసులుకు హితవు పలికారు. పోలీసుల బలహీనతలు, పనితీరుపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయని... ఈ నేపథ్యంలో ఓ సారి పునసమీక్షించుకోవాలని ఆయన పోలీసులకు సూచించారు.

 

విశాఖలో గతంలో కంటే అసాంఘిక శక్తుల కార్యకలాపాలు అధికమైయ్యాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో శాంతియుత వాతావరణం కల్పించకపోతే ఏ పారిశ్రామిక వేత్త విశాఖకు రారని అన్నారు.  గతంలో నగరంలో పోలీస్ శాఖలో చోటు చేసుకున్న తప్పులను సమీక్షించాలని కొత్త సీపీ అమిత్ గార్గ్ కి కె.హరిబాబు హితవు పలికారు.

Advertisement
 
Advertisement
Advertisement