వెలుగులోకి జేసీ దివాకర్‌రెడ్డి అవినీతి బాగోతం

JC Diwakar Reddy Illegal Mining In Anantapur - Sakshi

సాక్షి, అనంతపురం : టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అవినీతి బాగోతం భట్టబయలైంది. జిల్లాలో సిమెంట్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని, వేల సంఖ్యలో ఉద్యాగాలు కల్పిస్తామని ప్రజలను మభ్యపెట్టి మోసానికి పాల్పడ్డారు. అంతోటితో ఆగని జేసీ.. తన ఇంట్లోని పని మనుషులు, డ్రైవర్ల పేర్లతో త్రిశూల్‌ సిమెంట్స్‌కు అనుమతులు పొందారు. అలాగే రూ. 200 కోట్లు విలువ చేసే సున్నపురాయి గనులను అక్రమంగా విక్రయానికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో జేసీ దివాకర్‌ రెడ్డి అవినీతిపై విచారణ జరపాలని స్థానికులు గతంలోనే హైకోర్టును ఆశ్రయించారు. అవినీతి బయటకు రావడంతో త్రిశుల్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీని అనుమతులను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అనంతరం త్రిశుల్ భూములను వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, స్థానిక అఖిలపక్ష నేతలు పరిశీలించారు. జేసీ దివాకర్‌ అవినీతిపై సమగ్ర విచారణ జరిపి క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు. మరోవైపు ఆయనపై హైకోర్టులో నమోదు కేసులో తుది తీర్పు ఈనెల 10న వెలువడే అవకాశం ఉంది. (జేసీ బ్రదర్స్‌ దొంగల కన్నా హీనం)

కాగా కొనుప్పలపాడులో 649.86 హెకార్ట సున్నపురాతి గనుల లీజు రద్దు చేస్తున్నట్టు ఇదివరకే ఉత్తర్వులు జారీచేసింది. అలాగే సిమెంట్‌ తయారీ ప్లాంట్‌ నిర్మాణానికి.. మరో ఐదేళ్ల పొడిగింపు ఉత్తర్వులను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ప్లాంట్‌ నిర్మాణానికి సంబంధించి ఎలాంటి ముందడుగు పడనందునే లీజు రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. లీజు ప్రాంతం నుంచి 38 వేల 212 మెట్రిక్‌ టన్నుల సున్నపురాయి నిక్షేపాన్ని అక్రమంగా తవ్వి తీయడం, రవాణా చేయడంపై విచారణ కొనసాగుతుందని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. (త్రిసూల్‌ సిమెంట్‌ కంపెనీ లీజు రద్దు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top