ఈ గెలుపు జగన్‌దే

Jagan Mohan Reddy Will Be The CM Of Andhra Pradesh In Nexy 25 Years - Sakshi

 ఇక పాతికేళ్లు ఆయనే సీఎం

 జనరంజకంగా పాలన చేస్తారు  రాజన్న పాలన మళ్లీ తెస్తారు

 ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి

సాక్షా, ఒంగోలు సిటీ : జగన్‌ పడిన కష్టం ఫలించింది. ప్రజల కోసం అభివృద్ధి, సంక్షేమాన్ని చేయాలనుకొనే మంచి మనస్సుకున్న ఆశయం నెరవేరింది. తన విజయం జగన్‌దే. ఈ గెలుపు ఆయన ఇచ్చిందేనని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఉద్వేగంగా అన్నారు. గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద నుంచి అభిమానుల కోరిక మేరకు వారి వద్దకు విచ్చేశారు. ఆయనను కలిసిన విలేకర్లతో మాట్లాడారు. నవరత్నాలే జగన్‌ను గెలిపించాయన్నారు. సీఎంగా జగన్‌మోహన్‌రెడ్డి ముందు ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాల కార్యక్రమాలను అమలు చేస్తారన్నారు. మంచి ముఖ్యమంత్రిగా ఆయన గుర్తింపు తెచ్చుకుంటారన్నారు. రానున్న పాతికేళ్లు ఆయనే సీఎం అన్నారు. ఆయన జనం మనిషి. సీఎం పదవిలో ఉన్నా నిత్యం జనం సమస్యలనే ఆలోచిస్తుంటారన్నారు. జనం బాధలు, కష్టాలు వారి నష్టాలను తెలుసుకొనేందుకే పాదయాత్ర చేశారన్నారు. పాదయాత్రలో జనం పడ్తున్న బాధలను స్వయంగా చూశారన్నారు. ఎవరో చెబితే విని ప్రజలు ఇలా ఉన్నారని అనుకొనే నాయకుడు కాదని చెప్పారు. నేరుగా జనంతో కలిసి వారితో నడిచి వారితోనే నిత్యం జీవించిన జగన్‌ ఇక తన పాలనలో ఒక్కరంటే  ఒక్కరైనా ఇబ్బంది పడకుండా జనరంజకంగా పాలన అందిస్తారన్నారు. జగన్‌ రాకతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ప్రజల వద్దకు వచ్చే ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. 
అభిమాన నీరాజనం
బాలినేని శ్రీనివాసరెడ్డికి అభిమానులు నీరాజనం పలికారు. గురువారం  సాయంత్రం అబిమానులను పలుకరించేందుకు ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచి బయటకు వచ్చారు. ఆయనను అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున కలిశారు. బాలినేనిని అభిమానులు తమ భుజాలకెత్తుకున్నారు. కేకలు వేశారు. కేరింతలు కొట్టారు. బాలినేనిని ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద నుంచి బయటకు భుజాలపైనే తెచ్చారు. అక్కడి నుంచి వీఐపీ రోడ్డులోని బాలినేని ఇంటికి వచ్చారు. అక్కడ మహిళా ప్రతినిధులు, నాయకులు గులాము కొట్టారు. బాలినేనికి రంగు చల్లి రంగులో ముంచెత్తారు. మహిళా నాయకులు గంగాడ సుజాత, బైరెడ్డి అరుణ, నగర అధ్యక్షురాలు పల్లా అనురాధ, కావూరి సుశీల తదితరుల ఆధ్వర్యంలో బాలినేనికి హారతులిచ్చారు. బాలినేని సతీమణి బాలినేని శచీదేవి, బాలినేని సోదరి రమణమ్మలు ఎర్రనీళ్లతో దిష్ఠి తీశారు. అభిమానుల నడుమ విజయోత్సవాన్ని పంచుకున్నారు. తిరిగి వీవీఫ్యాట్స్‌ లెక్కింపు కోసం గురువారం సాయంత్రం తిరిగి ఓట్ల లెక్కింపు కేంద్రానికి వెళ్లారు.  బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా బాలినేని అభిమానులు నగరంలో మతాబులు కాల్చారు. అభిమానులు నగరంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top