నేడు నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ సీ23 | ISRO set to launch five foreign satellites on June 30 | Sakshi
Sakshi News home page

నేడు నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ సీ23

Jun 30 2014 2:29 AM | Updated on Sep 2 2017 9:34 AM

షార్ లోని మొదటి ప్రయోగవేదికపై పీఎస్‌ఎల్‌వీ సీ23

షార్ లోని మొదటి ప్రయోగవేదికపై పీఎస్‌ఎల్‌వీ సీ23

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ) సీ23 రాకెట్ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది.

* కొనసాగుతున్న కౌంట్‌డౌన్.. ఇంధనం నింపే ప్రక్రియ పూర్తి
 
శ్రీహరికోట (సూళ్లూరుపేట): పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ) సీ23 రాకెట్ సోమవారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ఉపగ్రహ వాహననౌక ప్రయోగం ఉదయం 9.52 గంటలకు జరుగుతుంది.

వాణిజ్య దృక్పథంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రయోగానికి సంబంధించి శనివారం ఉదయం 8.52 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ నిర్విఘ్నంగా కొనసాగుతోంది. ఈ వాహననౌక పీఎస్‌ఎల్‌వీ సీ23 ఫ్రాన్స్‌కు చెందిన 714 కిలోల స్పాట్ 07, జర్మనీకి చెందిన 15 కిలోల ఏఐశాట్, కెనడాకు చెందిన 30 కిలోల ఎన్‌ఎల్‌ఎస్-7.1, ఎన్‌ఎల్‌ఎస్ 7.2 ఉపగ్రహాలు, సింగపూర్‌కు చెందిన 7 కిలోల వెలాక్సీ, ఇస్రోకు చెందిన 60 కిలోల అడ్వాన్స్‌డ్ ఇనర్షియల్ నావిగేషన్ సిస్టం (ఏఐఎన్‌ఎస్)ను నింగిలోకి తీసుకెళ్లనుంది.

Advertisement
 
Advertisement
Advertisement