పులిరాజా ఐపీఎస్ హల్‌చల్ | IPS puliraja Hulchul | Sakshi
Sakshi News home page

పులిరాజా ఐపీఎస్ హల్‌చల్

Aug 9 2014 1:58 AM | Updated on Nov 6 2018 4:55 PM

పులిరాజా ఐపీఎస్ హల్‌చల్ - Sakshi

పులిరాజా ఐపీఎస్ హల్‌చల్

పొట్టి రాంబాబు గుర్తున్నాడా.. అదేనండి ‘ఈశ్వర్’ సినిమాలో ప్రభాస్‌కు పొట్టి ఫ్రెండ్‌గా కనిపించి కడుపుబ్బ నవ్వించాడు కదా.. గుర్తొచ్చిందా.. అరె అతని గురించి ఇప్పుడు ప్రస్తావనెందుకు..

పొట్టి రాంబాబు గుర్తున్నాడా.. అదేనండి ‘ఈశ్వర్’ సినిమాలో ప్రభాస్‌కు పొట్టి ఫ్రెండ్‌గా కనిపించి కడుపుబ్బ నవ్వించాడు కదా.. గుర్తొచ్చిందా.. అరె అతని గురించి ఇప్పుడు ప్రస్తావనెందుకు.. అనుకుంటున్నారా. ఒక్కసారి ఫేస్‌బుక్ ఓపెన్ చేస్తే మీకే అర్థమవుతుంది. ఈ మధ్య ‘హృదయ కాలేయం’ సినిమా హీరో సంపూర్ణేశ్‌బాబుపై ఫేస్‌బుక్‌లో చేసిన కామెంట్స్, ఫొటోలకు మంచి స్పందన రావడంతో తాజాగా మన పొట్టి రాంబాబు రంగంలోకి దిగాడు.

‘పులిరాజా-ఐపీఎస్’ సినిమాలో లీడ్‌రోల్ చేస్తున్న ఆయన షూటింగ్‌లో దిగిన పలు ఫొటోలతో ఫేస్‌బుక్‌లో హల్‌చల్ చేస్తున్నాడు. భుమికి మూడడుగుల ఎత్తులో ఉండే రాంబాబు ‘స్టార్ రభాస్’ పేరుతో సిక్స్‌ప్యాక్ కసరత్తులు చేయడం నెటిజన్లను నవ్విస్తోంది. టైటిలే కామెడీగా ఉండటంతో చాలామంది  అప్‌లోడ్ చేసుకుని ఫన్నీగా నవ్వుకుంటున్నారు.

ఈ పొట్టి రాంబాబు త్వరలో ‘పులిరాజా-ఈఫ్స్’ అంటూ రచ్చ కూడా చేస్తాడట. ఇప్పటికే చిన్నపిల్లలతో  ‘పులిరాజా ఎవడ్రా..’ అంటూ చేసిన ప్రచార టీజర్, ఇతర లఘుచిత్రాలతో యూట్యూబ్‌లో సందడి చేశాడు. ‘కథానాయకుడు’ సినిమాలో రజనీకాంత్‌తో, ‘దొంగ దొంగది’లో మనోజ్ స్నేహితుడిగా ఆకట్టుకున్న పొట్టిరాంబాబు పలు చిత్రాల్లో హాస్యం పండించి కమింగ్ సిక్స్‌ప్యాక్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని ఈ చిత్ర దర్శకుడు తిరువాయిపాటి రాఘవ సోషల్ నెట్‌వర్క్‌లో పేర్కొన్నారు.

వినూత్న రీతిలో హల్‌చల్ చేస్తున్న పులిరాజా-ఐపీఎస్ పొట్టి రాంబాబును చూసి ఫేస్‌బుక్, యూట్యూబ్ ప్రియులు మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఏదిఏమైనా చిన్నచిత్రాల దర్శకులు, నటులు తమ ఉనికిని ప్రదర్శించుకునేందుకు సోషల్ నెట్‌వర్క్‌ను ఆశ్రయించటం, వారిని  నెటిజన్లు  ఆదరించడం ఇటీవల చర్చనీయాంశంగా మారింది.

- నాగాయలంక
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement