ఆహ్వానం.. అదిరింది!! | innovative invation cards made for sacred thread ceremony | Sakshi
Sakshi News home page

ఆహ్వానం.. అదిరింది!!

May 22 2014 11:50 AM | Updated on Sep 2 2017 7:42 AM

ఆహ్వానం.. అదిరింది!!

ఆహ్వానం.. అదిరింది!!

ఆహ్వాన పత్రికల్లో సృజనాత్మకత రోజురోజుకూ వెల్లివిరుస్తోంది. సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా ఉపనయనానికి ఆహ్వానిస్తూ పత్రికలను తయారు చేయిస్తున్నారు.

ఆహ్వాన పత్రికల్లో సృజనాత్మకత రోజురోజుకూ వెల్లివిరుస్తోంది. విందుకు ప్రత్యేకంగా ఆహ్వానించాలంటే అరటి ఆకు మోడల్లో కార్డులు వస్తున్నాయి. వాటిమీద మనకు కావల్సిన మేటర్ ప్రింటింగ్ చేయించి పంచపెట్టుకోవచ్చు. ఇప్పుడు ఉపనయనానికి కూడా ఇలా సరికొత్త కార్డులు వచ్చేశాయి. సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా ఉపనయనానికి ఆహ్వానిస్తూ పత్రికలను తయారు చేయిస్తున్నారు.

మెడలో యజ్ఞోపవీతం, నుదుట విష్ణునామాలతో ఉపనయనం చేయించుకున్న వటువు రూపంలో ఈ కార్డును రూపొందించారు. హైదరాబాద్ కొత్తపేట గ్రీన్హిల్స్ కాలనీలో ఉంటున్న ఆంధ్రాబ్యాంక్ డీజీఎం శేషగిరిరావు.. తన కుమారుడు వెంకటేష్ సాకేత్ ఉపనయనం కోసం ప్రత్యేకంగా ఇలా ఆహ్వాన పత్రికను రూపొందించి తమ బంధు మిత్రులకు పంపారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని వాళ్ల బంధువులకు చేరిన ఆహ్వానపత్రిక ఇలా ఉంది. ఆసక్తి, అభిరుచి ఉండాలే గానీ.. ఇలా ఎన్నైనా చేయొచ్చని నిరూపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement