ఇందిరమ్మ ఇల్లు అమ్మబడును | indiramma house for sale | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ ఇల్లు అమ్మబడును

Aug 30 2013 2:45 AM | Updated on Sep 1 2017 10:14 PM

‘నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తాం..’ ఇదీ ప్రభుత్వ నినాదం.. కానీ, ‘ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు చెల్లించండి లేదా అమ్ముకోవడానికి అనుమతివ్వండి’ అని లబ్ధిదారుడు రోడ్డెక్కాడు..! ఇదేమి చోద్యం అనుకుంటున్నారా.. ఇదీ పచ్చినిజం..! ప్రభుత్వం నిధులు మంజూరు చేయక, అధికారులు డబ్బులు చెల్లించకపోవంతో ఓ లబ్ధిదారులు ఇందిరమ్మ ఇల్లునే అమ్మకానికి పెట్టాడు

 కాగజ్‌నగర్, న్యూస్‌లైన్ : ‘నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తాం..’ ఇదీ ప్రభుత్వ నినాదం.. కానీ, ‘ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు చెల్లించండి లేదా అమ్ముకోవడానికి అనుమతివ్వండి’ అని లబ్ధిదారుడు రోడ్డెక్కాడు..! ఇదేమి చోద్యం అనుకుంటున్నారా.. ఇదీ పచ్చినిజం..! ప్రభుత్వం నిధులు మంజూరు చేయక, అధికారులు డబ్బులు చెల్లించకపోవంతో ఓ లబ్ధిదారులు ఇందిరమ్మ ఇల్లునే అమ్మకానికి పెట్టాడు. ఈ సంఘటన కాగజ్‌నగర్ డివిజన్‌లో చోటు చేసుకుంది. బెజ్జూర్ మండలం బొంబాయిగూడకు చెందిన పగిడాల భువనేశ్వర్‌కు 2007లో రెండో విడతలతో ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. అధికారులు రూ.28,500 ఇస్తానని చెప్పారు. ఇంటి నిర్మాణం కోసం అధికారులు 30 బస్తాల సిమెంట్, రూ.11 వేలు ఇంటి నిర్మాణం కోసం అధికారులు మంజూరు చేశారు. మిగతా డబ్బులు ఆరేళ్లు గడిచినా ఇవ్వడం లేదు. ఇంటి నిర్మాణం కోసం ప్రైవేలుగా రూ.30 వేలు అప్పు తీసుకొచ్చాడు.
 
  మండలంలోని గృహనిర్మాణ శాఖ అధికారులను అడిగితే రేపుమాపూ అంటు తిప్పించుకుంటున్నారు. ఇల్లు కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఇందిరమ్మ ఇల్లును అమ్మకానికి బెట్టాడు. బిల్లులు చెల్లించక పోవడాన్ని నిరసిస్తూ గురువారం కాగజ్‌నగర్‌లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఫ్టెక్సీతో బైఠాయించాడు. దాదాపు అరగంటపాటు రోడ్డుపై బైఠాయిచడంతో కాగజ్‌నగర్ పట్టణ గృహ నిర్మాణ శాఖ ఏ సంజీవ్‌నాయక్ సంఘటన స్థలానికి చేరుకుని బాధితుడిని వివరాలు అడిగి తెలుసుకున్నాడు. గురువారం సెలవుదినం కావడంతో శుక్రవారం కార్యాలయానికి వస్తే రికార్డులు పరిశీలించి  పెండింగ్‌లో ఉన్న బిల్లు ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో బైఠాయింపును విరమించాడు.
 బిల్లులు ఇవ్వం మీ దిక్కున్నచోట చెప్పుకో అంటున్నారు..
 - పడిడాల భువనేశ్వర్, బాధితుడు
 ఇందిరమ్మ ఇంటి బిల్లుల కోసం అధికారుల చుట్టూ తిరిగినా స్పందించడం లేదు. బిల్లులు ఇవ్వం నీ దిక్కున్నచోట చెప్పుకో. గత వర్షాలతో చాలా నష్టపోయాను. ఇంటి కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేదు. అందుకే ఇంటిని అమ్మాలని నిర్ణయించాను. అధికారులు ఇప్పటికైనా బిల్లులు చెల్లించాలి.
 అన్ని బిల్లులు చెల్లించాం
 - సజీయోద్దిన్, ఇన్‌చార్జి హౌసింగ్ ఏఈ, బెజ్జూర్
 ఇందిరమ్మ రెండవ విడతలో ఇల్లు మంజూరైన విషయం వాస్తవమే. ఇంటి నిర్మాణానికి చెల్లించాల్సిన బిల్లులన్నీ చెల్లించాం. ఎలాంటి బిల్లులు పెండింగ్‌లో లేవు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement