విశాఖ సిటీ: తొలిసారిగా సముద్రమార్గంలో ప్రపంచయాత్ర చేస్తున్న భారత నౌకాదళ మహిళా బృందం ఆదివారం ఆస్ట్రేలియా నుంచి న్యూజిలాండ్‌కు బయల్దేరింది. వీరు ప్రయాణిస్తున్న ఐఎన్‌ఎస్వీ తరిణి నౌక అక్టోబర్ 23న ఆస్ట్రేలియాలోని ఫ్రెమెంటల్ పోర్టుకు చేరుకుంది.
బృందంలో లెఫ్టినెంట్ కమాండర్లు వర్టికా జోషి, ప్రతిభా జమ్వాల్, పి.స్వాతితో పాటు లెఫ్టినెంట్స్ ఎస్. విజయదేవి, బి.ఐశ్వర్య, పాయల్ గుప్తా ఉన్నారు. వీరంతా ఆదివారం వరకూ ఆస్ట్రేలియాలో నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీరిని ఆస్ట్రేలియాకు చెందిన మహిళా మంత్రులు పాల్ పపాలియా, సిమోనీ మెక్ గుర్క్‌తో పాటు వెస్ట్రన్ ఆస్ట్రేలియా పార్లమెంట్ సభ్యులైన భారత సంతతికి చెందిన పలువురు ప్రముఖులు అభినందించారు. ఆస్ట్రేలియా నేవీ చీఫ్ వైస్ అడ్మిరల్ టిమ్ బారెట్ వీరి నౌకను సందర్శించారు.
న్యూజిలాండ్‌కు సాహస మహిళలు
Nov 6 2017 2:46 AM | Updated on Nov 6 2017 2:46 AM
Advertisement
Advertisement