కేయూలో ఆమరణ దీక్షలు షురూ | indefinte hunger strike in kakathiya university from today onwards | Sakshi
Sakshi News home page

కేయూలో ఆమరణ దీక్షలు షురూ

Sep 2 2013 4:44 AM | Updated on Sep 1 2017 10:21 PM

కాకతీయ యూనివర్సిటీలోకు ప్రైవేట్ మెస్‌లను రద్దు చేయాలనే డిమాండ్‌తో వివిధ సంఘాల విద్యార్థు లు ఆదివారం ఆమరణ దీక్ష దిగారు.

 కేయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : కాకతీయ యూనివర్సిటీలో ప్రైవేట్ మెస్‌లను రద్దు చేయాలనే డిమాండ్‌తో వివిధ సంఘాల విద్యార్థు లు ఆదివారం ఆమరణ దీక్షకు దిగారు. క్యాంపస్‌లో పరి పాలన భవనం ఎదుట సాయంత్రం ఐదు గంటలకు దీ క్షలు ప్రారంభమయ్యాయి. మెస్‌ల ప్రైవేటీకరణను నిరసిస్తూ యూనివర్సిటీ పరిరక్షణ సమితిగా ఏర్పడిన వి ద్యార్థి సంఘాలబాధ్యులు 19రోజులుగా దీక్షలు చేస్తున్న విషయం విదితమే. అయినప్పటికీ అధికారులు వెనక్కి తగ్గకపోవడంతో విద్యార్థులు ఆమరణ దీక్షకు దిగారు.
 
 నిర్ణయం విరమించుకునే వరకు...
 ఆమరణ దీక్ష శిబిరంలో చలమల వీరన్న(పీడీఎస్ యూ), ఎ.యాకయ్య(కుర్సా), లక్ష్మణ్(ఎన్‌ఎస్‌యూ ఐ), నరహరి(ఎస్‌ఎస్‌ఎఫ్), రామారావు(టీఎస్‌ఎఫ్), ఆంగోతు వినోద్‌నాయక్(ఇంజనీరింగ్ విద్యార్థి) కూర్చున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారులకు ఎన్నిమార్లు విన్నవించినా స్పందన రాకపోవడంతో ఆమరణ దీక్షకు దిగామని తెలిపారు. ప్రైవేట్ మెస్‌లు రద్దు చేసే వరకు దీక్ష కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కాగా, మెస్‌ల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ విద్యార్థులతో పాటు నలుగురు ప్రొఫెసర్లు గవర్నర్ నరసింహన్, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహతో పాటు పలువురు మంత్రులను కలిశారు. అయినా అధికారులు పట్టువీడకపోవడంతో చివరగా ఆమరణ దీక్షకు దిగారు.
 
 నాణ్యమైన భోజనం అందడం లేదని చెబుతూ విద్యార్థులు ప్రైవేటు మెస్‌ల రద్దుకు పట్టుబట్టగా, దుబారా తగ్గినందున ప్రైవేట్ మెస్‌లనే కొనసాగిస్తామని అధికారులు స్పష్టం చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో శనివారం సీఎం, డిప్యూటీ సీఎంను నలుగురు విద్యార్థులు, నలుగురు ప్రొఫెసర్లు కలిసి రాగా, ఆదివారం ఉదయం చేపట్టిన నిరాహార దీక్షల ముగింపు అనంతరం సాయంత్రం ఐదు గంటలకు విద్యార్థి సంఘాలు నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమరణ దీక్షలు చేయాలని నిర్ణయించి ఆరుగురు విద్యార్థులు కూర్చున్నారు. కాగా, యూనివర్సిటీ పరిరక్షణ సమితిలో కొనసాగుతున్న ఎస్‌ఎఫ్‌ఐ బాధ్యులు ఆమరణ దీక్షల నుంచి మాత్రం విరమించుకున్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ కేయూ ఇన్‌చార్జ్ కె.వీరన్న ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యాసంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడిచినందున విద్యార్థులు తరగతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. మెస్‌ల విషయమై సీఎం, డిప్యూటీ సీఎం పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆందోళన నుంచి విరమించుకుంటున్నట్లు తెలిపారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement