ఇలియాజ్‌ను కఠినంగా శిక్షించాలి : ఎఐఎస్‌ఎఫ్ | Iliyajnu harshly punished: AISF | Sakshi
Sakshi News home page

ఇలియాజ్‌ను కఠినంగా శిక్షించాలి : ఎఐఎస్‌ఎఫ్

Nov 13 2014 3:00 AM | Updated on Sep 2 2017 4:20 PM

ఇలియాజ్‌ను కఠినంగా శిక్షించాలి : ఎఐఎస్‌ఎఫ్

ఇలియాజ్‌ను కఠినంగా శిక్షించాలి : ఎఐఎస్‌ఎఫ్

సాయం కోరుతూ వెళ్లిన అమ్మాయిపై లైంగి క దాడికి పాల్పడిన ఎంఐఎం జిల్లా కన్వీనరు ఇలియాజ్‌ను కఠినంగా శిక్షించాలని ఎఐఎస్‌ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు.

అనంతపురం ఎడ్యుకేషన్ : సాయం కోరుతూ  వెళ్లిన అమ్మాయిపై లైంగి క దాడికి పాల్పడిన ఎంఐఎం జిల్లా కన్వీనరు ఇలియాజ్‌ను కఠినంగా శిక్షించాలని ఎఐఎస్‌ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం స్థానిక సప్తగిరి సర్కిల్‌లో మానవహారంగా ఏర్పడి నిరసన తె లియజేశారు.

 ఈ సందర్భంగా ఎఐ ఎస్‌ఎఫ్ నగర కమిటీ ప్రధానకార్యదర్శి కె.మనోహర్ మాట్లాడుతూ ఇ టీవల కదిరి పట్టణంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థిని సాయం కోరుతూ ఎంఐఎం జిల్లా కన్వీనరు ఇలియాజ్ వద్దకు వెళ్లిం దని, ఆ సమయంలో బాలికను బెది రించి అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించారు. పది రోజుల కిందట తాడిమర్రిలో ఇలాంటి ఘటన చోటు చేసుకున్నప్పుడు చర్యలు తీసుకోవడంలో జిల్లా అధికారులు విఫలమయ్యారని ధ్వజమెత్తారు.

ఫలితంగా తరచూ ఎక్కడో ఒకచోట ఇలాంటివి పునరావృతం అవుతున్నాయన్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పం దించి ఇలియాజ్‌పై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమం లో ఎఐఎస్‌ఎఫ్ నగర అధ్యక్షుడు రమణయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శి కుళ్లాయప్ప, నాయకులు అనిల్, గి రి, మురళీ, అప్పస్వామి, రామాంజి, రవి, నాగేంద్ర పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement