ఐఐటీలో మెరిసిన తెలుగు తేజం | IIT  Telugu valor | Sakshi
Sakshi News home page

ఐఐటీలో మెరిసిన తెలుగు తేజం

Jul 31 2014 2:11 AM | Updated on Sep 2 2017 11:07 AM

ఐఐటీలో మెరిసిన  తెలుగు తేజం

ఐఐటీలో మెరిసిన తెలుగు తేజం

దేశంలో ప్రతిష్టాత్మక ఐఐటీ(ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లో తెలుగు తేజం మెరిసింది. గుడివాడలో పాఠశాల విద్య పూర్తిచేసుకున్న పి.రోహిత్ ఏకంగా ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బీటెక్(ఈ అండ్ ఈసీఈ) టాపర్‌గా నిలిచాడు

హైదరాబాద్: దేశంలో ప్రతిష్టాత్మక  ఐఐటీ(ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లో తెలుగు తేజం మెరిసింది. గుడివాడలో పాఠశాల విద్య పూర్తిచేసుకున్న పి.రోహిత్ ఏకంగా ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బీటెక్(ఈ అండ్ ఈసీఈ) టాపర్‌గా నిలిచాడు. బీటెక్‌లో 9.28/10 క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్(సీజీపీఏ) సాధించి ప్రతిభ చాటిన రోహిత్ ఇన్‌స్టిట్యూట్ సిల్వర్ మెడల్‌తోపాటు ఎండోమెంట్ ప్రైజ్‌ను జూలై 26న అందుకున్నాడు.

యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్‌ఏంజెలిస్‌లో ఉచితంగా పీహెచ్‌డీ చేసేందుకు ఫెలోషిప్ అవార్డును, జార్జియాటెక్, మిచిగన్ , యాన్ అర్బోర్, పుర్‌డ్యూ యూనివర్సిటీలలో ప్రవేశ అవకాశాలూ దక్కించుకున్నాడు. క్యాంపస్ ప్లేస్‌మెంట్ ద్వారా ఈ-బే/పేపాల్ సంస్థలో రూ.21.5 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సంపాదించాడు.
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement